Mary Kom : భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్(Mary Kom) మళ్లీ రింగ్‌లో అడుగుపెట్టనుంది. వీడ్కోలు పలికిన మణిపూర్ మణిపూస ఇకపై ప్రొఫెషనల్ బాక్సింగ్ (Proffessional Boxing)లో చెలరేగాలని భావిస్తోంది. వయోపరిమితి కారణంగా అమెచ్చూర్ బాక్సింగ్(Amateur Boxing)లో పోటీ పడేందుకు అవకాశం లేనందున ప్రొషెషన్ బాక్సింగ్ మీద కన్నేసినట్టు ఆమె తెలిపింది. ఆదివారం ఫిట్ ఇండియా 67వ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
మహిళా బాక్సింగ్‌లో లెజెండ్‌గా పేరొందిన మేరీ కోమ్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించనుంది. కొన్నాళ్లుగా బాక్సింగ్‌కు దూరమైన ఆమె త్వరలోనే ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో మెరవాలని భావిస్తోందీ ఒలింపిక్ కాంస్య పతక విజేత. ‘ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుపొందడం చాలా గొప్ప విషయం. వయోపరిమితి కారణంగా దేశం తరఫున అమెచ్యూర్ బాక్సింగ్ ఆడే అవకాశం లేని పరిస్థితి.
Delhi: Boxer and Olympic medalist Mary Kom participates in the 67th edition of Fit India Sundays on Cycle pic.twitter.com/A8CY8CLgx1
— IANS (@ians_india) March 29, 2026
ఈ సమయంలో నాముందున్న ఆప్షన్ ప్రొఫెషనల్ బాక్సింగ్. ప్రస్తుతం ఈ ఆట గురించి ఆలోచిస్తున్నా. ఈ వయసులోనూ నాలో చేవ తగ్గలేదని ప్రపంచానికి చాటాలనుకుంటున్నా. వయసుతో సంబంధం లేకుండా సాధ్యమైనన్ని రోజులు ఫిట్‌గా ఉండాలని అనకుంటున్నా అని 43 ఏళ్ల మేరీకోమ్ వెల్లడించింది.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌కు చెందిన మేరీ కోమ్ భారత మహిళా బాక్సింగ్‌లో మహారాణిగా వెలుగొందింది. తన పవర్ పంచ్‌లతో ప్రత్యర్థులను పడగొట్టిన ఈ ఉక్కు మహిళ ఏకంగా ఆరుసార్లు (2002, 2005, 2006, 2008, 2010, 2018) ప్రపంచ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించి మేరీ కోమ్.. ఆసియా గేమ్స్‌లో పసిడి, కాంస్య పతకాలతో మెరిసింది.
VIDEO | Six-time world champion Mary Kom is considering a move into professional boxing, signaling a potential return to the ring after age restrictions ended her amateur career.
Speaking on the sidelines of “Sundays on Cycles” event, the 43-year-old Olympic medalist said she is… pic.twitter.com/mS8ZaxMEpS
— Press Trust of India (@PTI_News) March 29, 2026
2018 కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి పతకం కొల్లగొట్టి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అయితే.. నిఖత్ జరీన్ రూపంలో మేరీ కోమ్కు గట్టి పోటీ ఎదురైంది. దాంతో.. అమెచ్యూర్ బాక్సింగ్‌కు దూరమైన ఈ స్టార్ బాక్సర్ సొంతంగా అకాడమీ నడుపుతూ యువ బాక్సర్లను తీర్చిదిద్దుతోంది.