Uttar Pradesh | యూపీలో దారుణం.. చాక్లెట్లు దొంగతనం చేసిందనే నెపంతో కూతురిని కొట్టి చంపిన తండ్రి
Uttar Pradesh : చాక్లెట్లు దొంగతనం చేసిందనే నెపంతో ఏకంగా చిన్నారి కూతురునే కొట్టిచంపాడు ఓ కర్కశ తండ్రి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని, బులంద్‌షహర్ ప్రాంతంలోని రతన్‌పూర్ గ్రామంలో జరిగింది.
Uttar Pradesh : చాక్లెట్లు దొంగతనం చేసిందనే నెపంతో ఏకంగా చిన్నారి కూతురునే కొట్టిచంపాడు ఓ కర్కశ తండ్రి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని, బులంద్‌షహర్ ప్రాంతంలోని రతన్‌పూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఒక షాపులో పన్నెండేళ్ల చిన్నారి పూజ డబ్బులు చెల్లించకుండా చాక్లెట్లు తీసుకెళ్లింది. దీన్ని దొంగతనంగా భావించిన షాపు యజమాని పూజ తండ్రికి ఈ విషయం చెప్పాడు.
అప్పటికే మద్యం తాగి ఉన్న పూజ తండ్రి పుష్పేంద్ర ఈ విషయం తెలియగానే ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. కూతురు దొంగతనం చేసిందనే ఆవేశంతో ఇంటికి వెళ్లి పూజపై దాడి చేశాడు. కర్రతో బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కూతురని కూడా చూడకుండా తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో పూజ తీవ్రంగా గాయపడింది. రక్తస్రావం జరిగింది. అయినప్పటికీ గాయాలపాలైన పూజను ఒక గదిలో బంధించాడు. అంతేకాదు.. భార్యను కూడా బంధించాడు. ఆ తర్వాత తాళం వేసి పుష్పేంద్ర అక్కడ్నుంచి పారిపోయాడు. కొంతసేపటి తర్వాత తల్లి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు వచ్చి వారిద్దరినీ విడిపించారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే పూజ మరణించిందని వైద్యులు తెలిపారు.
మృతదేహాన్ని మార్చురికి తరలించిన అనంతరం బాలికకు పోస్టుమార్టం నిర్వహించారు. బాలిక పుర్రెకు గాయమైందని, అలాగే ఒంటిపై చాలా గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. 10-12 వరకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన బాలిక తండ్రి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

