ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ క్రికెటర్ హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ బుధవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ ద్వారా హర్మన్ అత్యధిక(150) టీ20 మ్యాచ్‌లాడిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
‘తొలిసారి జరుగుతున్న మహిళల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీమ్‌కు హర్మన్‌ప్రీత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. జాతీయ జట్టు నాయకురాలిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన కౌర్..ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించనుంది’ అని నీతా అంబానీ పేర్కొంది. శనివారం మొదలయ్యే లీగ్‌లో ముంబై, గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి పోరు జరుగనుంది.