ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వేలాదిమంది ‘బతుకు జీవుల’ ఆకలి తీరుస్తున్న ‘డబ్బావాలా’లు భారత క్రికెట్ జట్టుకు మద్దతుగా నిలిచారు. వెస్టిండీస్/యూఎస్ఎ వేదికలుగా మరో మూడు రోజుల్లో మొదలుకాబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొననున్న రోహిత్ సేనకు మద్దతు తెలిపారు.
మంగళవారం సుమారు వెయ్యి మంది డబ్బావాలాలు టీమ్ఇండియా జెర్సీలు ధరించి ప్రపంచకప్ కొట్టాలని ఆకాంక్షిస్తూ నినాదాలు చేశారు. ఈసారి భారత జట్టు బలంగా ఉందని, రోహిత్, విరాట్ తమ మ్యాజిక్‌తో పొట్టికప్పును దేశానికి తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.