ముంబై : ఇండియన్ సూపర్ లీగ్‌లో టాపర్ ముంబై సిటీ ఎఫ్సీకి చుక్కెదురైంది. ఆదివారం ఈస్ట్బెంగాల్తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 0-1తో ఓడిపోయింది. విరామం వరకు గోల్‌కోసం ఇరు జట్లు చేసిన ప్రయత్నాలన్నీ వమ్మయ్యాయి. విరామానంతరం 52వ నిమిషంలో నోరెమ్ మహేష్ సింగ్ చేసిన గోల్‌తో ఈస్ట్ బెంగాల్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సమయం ముగిసే వరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకుని అగ్రస్థానంలోని ముంబైకి షాకిచ్చింది.