 
                                                            Jemimah Rodrigues : ప్రతి క్రికెటర్ కెరీర్లో కొన్ని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఉంటాయి. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో అది కూడా అదే నాకౌట్ పోరు శతకంతో జట్టును గెలిపిస్తే ఆ క్రికెటర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) పేరు దేశమంతా మార్మోగిపోతోంది. ఈ బక్కపలచటి అమ్మాయి గురువారం ఆస్ట్రేలియాపై చెలరేగిన తీరు అద్భుతమంటే అతిశయోక్తి కాదు. మహారాష్ట్రకు చెందిన జెమీమా.. తన సొంతమైదానంలో చెలరేగిపోయి అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని కరిగించడంలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ‘టాక్ ఆఫ్ ది వరల్డ్ కప్’ అయిన తన ఆటే కాదు అభిరుచులు కూడా ఘనమేనండోయ్. సోషల్‌మీడియాలో చురుకుగా ఉండే తను నాకౌట్ విజయాన్ని ఆస్వాదిస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకం. అలాంటిది వరల్డ్ కప్‌లో నాకౌట్ పోరులో శతకం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఛేజింగ్‌లో ఒత్తిడిని ఓడిస్తూ జట్టును గెలిపించే సెంచరీ కొట్టాలంటే దమ్ముండాలి. డీవై పాటిల్ స్టేడియంలో జెమీమా రోడ్రిగ్స్ గురువారం రాత్రి ఆస్ట్రేలియాపై అలాంటి దమ్మున్న ఇన్నింగ్సే ఆడింది. యావత్ భారతావని ఆశల్ని మోస్తూ క్రీజులోకి వెళ్లిన తను.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో 167 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేసింది.
Unforgettable dressing room moments 🫶
Right after playing a 𝙅𝙚𝙢 💎 of a knock ❤️
Get your #CWC25 tickets 🎟️ now: https://t.co/vGzkkgwXt4 #TeamIndia | #INDvAUS | #WomenInBlue | @JemiRodrigues pic.twitter.com/1DEtWkUemo
— BCCI Women (@BCCIWomen) October 31, 2025
కెప్టెన్ ఔటైనా తన పని ఇంక ముగిలేదన్నట్టు.. టెయిలెండర్లతో కీలక రన్స్ రాబట్టి టీమిండియా విజయంలో కీ రోల్ పోషించింది. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన జెమీమా.. మ్యాచ్ అనంతరం భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయింది. ఇది కలా? నిజమా? అని నమ్మలేకపోయిన తను భావితరాలకు స్ఫూర్తి నింపే ఆటతో అందరి మనసులు గెలుచుకుంది.
ముంబైలోని క్రిస్టియన్ కుటుంబంలో పుట్టింది జెమీమా. చిన్నప్పటి నుంచి మంచి అథ్లెట్ అయిన తను చదువుతో పాటు ఆటల్లోనూ ప్రతిభ కనబరిచేది. క్రికెట్‌తో పాటు హాకీ కూడా ఆడేది. ఆమె ఆసక్తులను గమనించిన తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ (Ivan Rodrigues) ప్రోత్సహించారు. అయితే.. మొదట్లో హాకీని సీరియస్‌గా తీసుకున్న తను మహారాష్ట్ర తరఫున జాతీయ స్థాయి టోర్నీలు ఆడింది. అన్నట్టు జెమీమాకు తొలి క్రికెట్ కోచ్ ఆమె తండ్రే. ఆయన తర్ఫీదుతో జూనియర్ స్థాయిలో అదరగొట్టిన జెమీమా.. అండర్ 17, అండర్ -19 టోర్నీల్లో సత్తా చాటి జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడింది.
To be Honest, I’m overwhelmed by this-
Where I was then & where God has got me now
The 13y/o girl who went to watch the West Indies play didn’t think she’d be competing alongside them 6 years later
It feels like a dream & Im loving every part of it..
But the best is yet to come✊🏼 pic.twitter.com/JKN4WKMEOZ— Jemimah Rodrigues (@JemiRodrigues) December 7, 2019
టీమిండియాకు ఆడాలనే కోరిక మాత్రం 2017లో ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది భారత జట్టు. రన్నరప్‌గా స్వదేశం విచ్చేసిన మిథాలీరాజ్ (Mithali Raj) బృందానికి స్వాగతం పలకడానికి ముంబై విమానాశ్రయం వెళ్లిన కొంతమంది యంగ్ క్రికెటర్లలో జెమీమా ఒకరు. తను కూడా దేశానికి ఆడాలనే సంకల్పం ఆరోజు నుంచి ఆమెలో రెండింతలైంది. అనుకున్నట్టే మరుసటి ఏడాదే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిందీ డాషింగ్ బ్యాటర్.
2⃣0⃣2⃣2⃣ – Left out of the squad for the ODI World Cup
2⃣0⃣2⃣5⃣ – Scores an unbeaten century to power India into the #WomensWorldCup2025 final
Jemimah Rodrigues overcame a “very difficult time” in her career before she established herself as a genuine modern-day star.
Read… pic.twitter.com/7O9g53vdi4
— Sportstar (@sportstarweb) October 31, 2025
ఆటతో అదరగొట్టే జెమీమాకు చాలానే హాబీలు ఉన్నాయి. క్రికెట్ ఒక్కటే కాదు.. రేసింగ్.. వీడియోలు తీయడం, డాన్స్ చేయడం.. మనసును ఉత్సాహపరిచేందుకు గిటార్ వాయించడం. ఎల్లప్పుడూ చలాకీగా ఉండే జెమీమా వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో అజేయ శతకంతో జట్టును గెలిపించింది. 48వ ఓవర్లో అమన్‌జోత్ కౌర్ విన్నింగ్ రన్ కొట్టగానే భావోద్వేగానికి లోనైంది. సంతోషం పట్టలేక ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగుతూనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రజెంటేషన్‌లో మాట్లాడిన జెమీమా.. ఆ తర్వాత గిటార్ సెలబ్రేషన్‌తో రిలాక్సైంది.
𝗪𝗮𝗹𝗸𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝘁𝗮𝗹𝗸, 𝗳𝘁. 𝗝𝗲𝗺𝗶𝗺𝗮𝗵 𝗥𝗼𝗱𝗿𝗶𝗴𝘂𝗲𝘀 😎
She said Navi Mumbai is #TeamIndia‘s home and proved it with an innings of a lifetime to seal a spot in the #Final. 🔥
Get your #CWC25 tickets 🎟️ now: https://t.co/vGzkkgwpDw #WomenInBlue | #INDvAUS |… pic.twitter.com/Hcfa9e0Yi5
— BCCI Women (@BCCIWomen) October 31, 2025
ఫొబే లిచ్‌ఫీల్డ్ సూపర్ సెంచరీతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయడంతో టీమిండియా విజయంపై అనుమానాలు తలెత్తాయి. లీగ్ దశలో ఆ జట్టు చేతిలో ఓడడం కూడా అందుకు ఓ కారణం. కానీ, అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత అమ్మాయిలు సంచలన ఆటతో రికార్డు లక్ష్యాన్ని ఉఫ్మనిపించారు. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిశాక డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకున్న మాటల్ని జెమీమా గుర్తు చేసుకుంది. ‘సెమీ ఫైనల్లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించడంపై జట్టు సభ్యులం డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకున్నాం. ఇది మన మైదానం. వేరేవాళ్లు మన నుంచి విజయాన్ని లాగేసుకునే అవకాశం ఇవ్వొద్దని అనుకున్నాం. అది జరగాలంటే ఆధిపత్యం చెలాయించాలని నిర్ణయించుకున్నాం. చెత్త షాట్లకు తావివ్వకుండా మంచి క్రికెట్ ఆడాలనుకున్నాం.. ఆరంభంలోనే ఓపెనర్ షఫాలీ వర్మ, స్మృతి మంధాన ఔట్ కావడంతో నేను, కెప్టెన్ హర్మన్ జట్టును గెలిపించాల్సిన బాధ్యతను తీసుకున్నాం.
𝘾𝙡𝙖𝙨𝙨𝙞𝙘 𝘾𝙝𝙖𝙨𝙚 🔥
Harmanpreet Kaur 🤝 Jemimah Rodrigues
A partnership of 1️⃣6️⃣7️⃣(156), which is the highest for #WomenInBlue in ICC World Cup knockouts for any wicket. 🫡
Scorecard ▶ https://t.co/ou9H5gN60l#TeamIndia | #CWC25 | #INDvAUS | @ImHarmanpreet |… pic.twitter.com/Eh9SHYbhzD
— BCCI Women (@BCCIWomen) October 30, 2025
ఇద్దరం చివరిదాకా ఉంటే విజయం మనదే అని గట్టిగా నమ్మాం. హర్మన్ ఔటైనా దీప్తి, రీచా, అమన్‌జోత్ గొప్పగా ఆడారు. మిడిల్ ఓవర్లలో నేను చాలా అలసిపోయాను. ఒంట్లో సత్తువ కూడా తగ్గిపోయింది. అయినా దేశాన్ని గెలిపించాలనే కసితో చివరిదాకా నిలబడ్డాను’ అని జెమీమా భావోద్వేగంతో చెప్పింది. వరల్డ్ కప్ ఆరంభంలో ఫామ్‌లేమితో ఇబ్బందిపడిన జెమీమా.. న్యూజిలాండ్‌పై సూపర్ హాఫ్ సెంచరీతో మెరిసింది. అదే జోరును సెమీస్నూ కొనసాగించిన తను 127 పరుగులతో అజేయంగా జట్టుకు అపురూపమైన విజయాన్ని కట్టబెట్టింది. టాప్ గేర్‌లో ఆడుతున్న ఈ యంగ్‌స్టర్ ఫైనల్లో సఫారీలపైనా చెలరేగిపోవాలని కోరుకుందాం.
 
                            