చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో స్వల్ప వ్యవధిలోనే రోహిత్ శర్మ, సూర్యకుమార్ వికెట్లను కోల్పోయిన ముంబై ఇండియన్స్ నిలకడగా ఆడింది. క్వింటన్ డికాక్(40) స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. రషీద్ ఖాన్ వేసిన తన మూడో ఓవర్లో 9 రన్స్ రాబట్టారు. పవర్‌ప్లేలో భారీగా పరుగులు సమర్పించుకున్న రైజర్స్ బౌలర్లు తర్వాత పుంజుకున్నారు.
ముఖ్యంగా విజయ్ శంకర్, రషీద్ కట్టుదిట్టంగా బంతులేస్తూ బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా పరుగులు చేయకుండా అడ్డుకుంటున్నారు. అర్ధశతకానికి చేరువగా వచ్చిన డికాక్..ముజీబ్ రెహమాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. 14 ఓవర్లకు ముంబై మూడు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇషాన్ కిషన్(8), కీరన్ పొలార్డ్(0) క్రీజులో ఉన్నారు.
WICKET!@Mujeeb_R88 gets his first wicket in #SRH colours. de Kock looks to go big over long on, but can't get all of it. Taken in the deep.
— IndianPremierLeague (@IPL) April 17, 2021
QDK goes for 40.
Live – https://t.co/oUdPyW0t8T #MIvSRH #VIVOIPL pic.twitter.com/NgYVpHRUDe