MS Dhoni | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యాడు. చెన్నైలో ఆదివారం ముంబయితో మ్యాచ్‌లో ఆడనున్నాడు. 2016, 2017 సీజన్లు మినహా మిగతా అన్ని సీజన్లలో చెన్నై తరఫున టీ20 క్రికెట్ ఆడుతున్నారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ పలుకనున్నాడనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సీజనే ధోనీకి చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా రిటైర్మెంట్ వార్తలపై ధోనీ స్పందించాడు. జియో హాట్‌స్టార్‌తో మాట్లాడుతూ రిటైర్మెంట్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తాను కోరుకున్నంత కాలం క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు.
‘నేను కోరుకున్నంత కాలం సీఎస్కే తరఫున ఆడగలను. ఇది నా ఫ్రాంచైజీ. నేను వీల్‌చైర్‌లో ఉన్నా వారు (సీఎస్కే) నన్ను లాక్కెళ్తారు’ అంటూ ధోనీ వ్యాఖ్యానించాడు. ముంబయితో మ్యాచ్‌కు ముందు ధోనీ.. హార్దిక్ పాండ్యా, కీరాన్ పోలార్డ్‌లను కలిశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే వీడియోలను షేర్ చేసింది. ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఐదు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆటగాడిని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తారు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సీఎస్కే ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకుంది. తనకు మరికొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని ధోనీ తెలిపాడు. ముంబయితో మ్యాచ్‌కు ముందు భారీగా ప్రాక్టీస్ చేశాడు.
అర్ధరాత్రి వరకు ధోనీ ప్రాక్టీస్ చేస్తూనే కనిపించాడని సీఎస్కే బ్యాటర్ సామ్ కర్రాన్ పేర్కొన్నాడు. కెప్టెన్ గైక్వాడ్ సైతం ధోనీపై ప్రశంసలు కురిపించాడు. 43 సంవత్సరాల వయసులోనే ధోనీకి క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని.. ఈ సీజన్లో ధోనీ కీలక ఇన్నింగ్స్ ఆడతాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సీజన్లో ఐపీఎల్లో ధోనీ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్లో ఏడు, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. కొన్ని షాట్లు మాత్రమే తిలకించే అవకాశం అభిమానులకు దక్కేది. 2024 ఐపీఎల్ సీజన్లో ధోనీ 220 కంటే ఎక్కువ స్ట్రయిక్ రేట్, 53.67 సగటుతో 161 పరుగులు చేశాడు.