MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అభిమాన గణం ఎక్కువ. టీమిండియా మ్యాచ్ ఉందంటే చాలు అతడి హెలికాప్టర్ షాట్ చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియానికి తరలి వెళ్తారు. అంతర్జాతీయ క్రికెట్కు ఈ జార్ఖండ్ డైనమైట్ వీడ్కోలు పలికినా కూడా అతనిపై అభిమానం మాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనం ఏంటంటే..? భారత్, శ్రీలంక జట్లు మూడో వన్డే ఆడనున్న తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియం బయట ధోనీ ఫ్యాన్స్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. 50 అడుగుల ఎత్తైన ధోనీ కటౌట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. రేపు మధ్యాహ్నం 1ః30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
కెప్టెన్గా ధోనీ భారత్కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. అతని సారథ్యంలో యువ భారత్ 2007 వరల్డ్ కప్ గెలిచింది. 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్లో ట్రోఫీ నెగ్గింది. 1983 తర్వాత వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్గా అవతరించింది. ధోనీ 2020 ఆగష్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరో రెండు నెలల్లో ఐపీఎల్ 2023 మొదలు కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్న ధోనీ ఈ సారి ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు.
50 ft cutout of MS Dhoni in Thiruvanthapuram ahead of the 3rd ODI between India and Sri Lanka.
The craze for MSD is on another level❤
📷: dhonifanskerala/Instagram#INDvSL #INDvsSL #India #ODI #ODIs #Cricket #Sportsbettingmarkets #MSD #MahendraSinghDhoni #Dhoni #MSDHONI pic.twitter.com/ybdPNyBH04
— Sportsbettingmarkets.com (@Sbettingmarkets) January 14, 2023