Delhi AQI : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాణాలు (AQI) ఆందోళన కలిగిస్తున్నాయి. శీతకాలం ఆరంభమవ్వవడంతో శనివారం గాలి నాణ్యత ప్రమాణలు మరింతగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన కాలుష్యం నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. 24 గంటల్లో ఢిల్లీలోని గాలి నాణ్యత సగటును వెల్లడించిన సీపీసీబీ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత 400 దాటడం గమనించింది. దాంతో. దేశంలోనే అంత్యంత కలుషితమైన నగరాల్లో ఒకటిగా పేర్కొంది. ఇంకేముంది ఢిల్లీ సైతం రెడ్ జోన్లో చేరింది. అలానే ఎన్సీఆర్ పరిధిలోని గ్రేటర్ నొయిడాలోనూ గాలి నాణ్యత 354, గజియాబాద్‌లో 339గా ఉన్నట్టు బోర్డు చెప్పింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు శనివారం సాయంత్రం 4 గంటలకు గాలి నాణ్యతను లెక్కించింది. ఆ సమయంలో 361 పాయింట్లు ఉన్నట్టు గుర్తించింది బోర్డు. దాంతో.. దేశంలోనే రెండో అత్యంత కలుషితమైన నగరంగా ఢిల్లీని పేర్కొంది. నగరంలోని 38 ప్రాంతాల్లో కాలుష్య తీవ్రతను అంచనా వేస్తోంది సీపీసీబీ. శనివారం నమోదైన ఏక్యూఐని పరిశీలించగా.. వజీపూర్‌లో 420, బెరారిలో 418, వివేక్ విహార్‌లో 406, నెహ్రూ నార్లో 404, అలీపూర్‌లో 402 పాయింట్లు దాటినట్టు బోర్డు గుర్తించింది. ఈ ప్రాంతాలన్నీ అత్యంత ప్రమాదకరమైన దశలో ఉన్నాయని బోర్డుకు చెందిన సమీర్ యాప్ ఆందోళన వెలిబుచ్చింది.
Welcome to delhi 😇😇
With 400+AQI #delhipollution #AirQuality pic.twitter.com/TzdDSLOV6z— Archana Tiwari (@ArchanaRajdharm) November 8, 2025
నగరంలో గాలి నాణ్యత అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) చర్యలకు తీసుకుంటున్నారు. వాహనాల రద్దీని తగ్గించడం కోసం ప్రభుత్వ ఆఫీసుల వేళలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం తర్వాత ప్రభుత్వ ఆఫీసుల వేళలు ఉదయం 10:00 నుంచి సాయంత్రం 6:30గా పనిచేస్తాయని సీఎం రేఖ తెలిపారు. ఇక మున్సిపల్ కార్యాలయాల పనివేళల్ని ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకుగా నిర్ణయించారు.
Welcome to delhi 😇😇
With 400+AQI #delhipollution #AirQuality pic.twitter.com/TzdDSLOV6z— Archana Tiwari (@ArchanaRajdharm) November 8, 2025