Richa Ghosh : వరల్డ్ కప్ ఛాంపియన్ రీచా ఘోష్ (Richa Ghosh)పై వరాల జల్లు కురిసింది. భారత జట్టు విజయంలో కీలకమైన రీచాకు స్వరాష్ట్రం బెంగాల్లో ఘన స్వాగతంతో పాటు ఊహించని పదవి దక్కింది. శనివారం జరిగిన సన్మాన కార్యక్రమంలో వికెట్ కీపర్, బ్యాటర్‌ను డీఎస్పీగా నియమించింది బెంగాల్ ప్రభుత్వం. విశ్వ విజేతగా దేశం, రాష్ట్రం ఖ్యాతిని ఇనుమడింపజేసిన రీచాను సన్మాన వేడుకలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.
ప్రపంచకప్‌లో విధ్వంసక ఆటతో చెలరేగిన రీచా ఘోష్ భారత జట్టుకు నిఖార్సైన ఫినిషర్ అనిపించుకుంది. తనదైన దూకుడుతో టీమిండియా చరిత్ర సృష్టించడంలో కీలకమైన రీచాకు స్వరాష్ట్రం బెంగాల్లో భారీ స్వాగతం లభించింది. శుక్రవారం సొంత ప్రాంతం సిలిగురి చేరుకున్న ఆమెను శనివారం ప్రభుత్వం, బెంగాల్ క్రికెట్ సంఘం ఘనంగా సన్మానించాయి. ఈ కార్యక్రమంలోనే రీచాకు డీఎస్పీ హోదాను ఖరారు చేశారు సీఎం మమతా బెనర్జీ.
Bengal’s First Cricket World Cup Winner RICHA GHOSH was felicitated today at Eden Gardens by CM @MamataOfficial & CAB President Sourav Ganguly for her stellar performance 💙🏆
She was awarded ₹34 Lakh, DSP Rank in WB Police & Banga Bibhushan – Bengal’s Highest Civilian Award 🇮🇳 pic.twitter.com/mRpLnSlEwL
— নক্ষত্র | Nakshatra ❁ (@BombagorerRaja) November 8, 2025
యావత్ దేశం గర్వించదగ్గ విజయంలో తనవంతు పాత్రను సమర్ధంగా పోషించిన ఆమెకు రూ.34 లక్షల చెక్కును ప్రదానం చేశారు. క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ పేసర్ ఝులాన్ గోస్వామి, ముఖ్యమంత్రి మమత చేతుల మీదుగా రీచా చెక్కును అందుకున్నారు. రాష్ట్రంలో మహిళా క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచినందుకు రీచాకు బెంగాల్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బంగా బిబుసాన్’ అవార్డును ప్రకటించారు.
ప్రపంచకప్‌లో ఓపెనర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధానలు ఇచ్చిన శుభారంభాన్ని చివరకు భారీ స్కోర్‌గా మలచడంలో రీచా పాత్ర మరువలేనిది. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఈ చిచ్చరపిడుగు 133.52 స్ట్రయిక్ రేటుతో 235 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాపై ఆమె చేసిన 94 పరుగుల ఇన్నింగ్స్ హైలెట్. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై జెమీమా రోడ్రిగ్స్(127 నాటౌట్)తో కలిసి విలువైన రన్స్ చేసింది రీచా. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండి16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 రన్స్ చేసింది. ఇక ఫైనల్లోనూ దంచేసిన తను 34 రన్స్‌తో టీమిండియా భారీ స్కోర్ చేయడంలో భాగమైంది.
Can someone pinch me already? 🏆 pic.twitter.com/wHJFIGEG28
— Richa Ghosh (@13richaghosh) November 4, 2025