ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ మరోసారి విఫలమయ్యారు.
రాజస్థాన్ రాయల్స్‌తో పోరులో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా టీ20 తరహాలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. రాజస్థాన్ బౌలర్ల ధాటికి కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. రాహుల్ త్రిపాఠి(36: 26 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ వేగంగా ఆడలేకపోయారు.
నితీశ్ రాణా(22), శుభ్‌మన్ గిల్(11), సునీల్ నరైన్(6), ఇయాన్ మోర్గాన్(0), దినేశ్ కార్తీక్(25), రస్సెల్(9) చేతులెత్తేశారు. రాయల్స్ బౌలర్లలో క్రిస్ మోరీస్ నాలుగు వికెట్లు తీయగా జయదేవ్ ఉనద్కత్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహమాన్ తలో వికెట్ పడగొట్టారు.డెత్ ఓవర్లలో మోరిస్ కళ్లుచెదిరే బంతులతో కోల్‌కతాకు చుక్కలు చూపిస్తూ వికెట్లు పడగొట్టడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది.
Who thought we would have an #IPLSelfie in the middle of the #RRvKKR game? 😁🤳 #VIVOIPL @ParagRiyan | @rahultewatia02 | @rajasthanroyals pic.twitter.com/qVEndXEdk7
— IndianPremierLeague (@IPL) April 24, 2021