పారిస్: మాంటె-కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు రోహన్ బోపన్న, బెన్ షెల్టన్ (అమెరికా) జోడీ క్వార్టర్స్‌కు చేరింది. పురుషుల డబుల్స్‌లో ఈ ఇండో-యూఎస్ ద్వయం 2-6, 7-6 (7/4), 10-7తో బొలెల్లి-వవస్సురి (ఇటలీ)ని ఓడించింది.
మూడో సీడ్ ఇటాలియన్ జోడీ తొలి రౌండ్‌ను అలవోకగా గెలిచినా బోపన్న-షెల్టన్ ద్వయం తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుస సెట్లు నెగ్గి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.