ప్రపంచ క్రికెట్‌కు హెలికాప్టర్ షాట్‌ను పరిచయం చేసింది మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన చాలా మంది ఆటగాళ్లు కూడా ఈ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. చివర్లో బ్యాటింగ్ చేస్తున్న బెంగళూరు పేసర్ మహమ్మద్ సిరాజ్.. ధోనీ తరహాలో షాట్ కొట్టి బౌండరీ సాధించాడు. డ్వేన్ బ్రావో వేసిన చివరి ఓవర్ చివరి బంతికి ఈ ఘటన జరిగింది. ధోనీ కీపింగ్ చేస్తుండగా.. అతని ముందే అలా హెలికాప్టర్ షాట్ కొట్టడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై జట్టు.. తాజా ఐపీఎల్లో తొలి విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.