సిడ్నీ: మూడో వన్డే(AUSvIND)లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. సిడ్నీలో జరుగుతున్న మ్యాచ్‌లో అతను 29 రన్స్ చేశాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే సిరాజ్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడబోయిన హెడ్.. బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే వన్డేల్లో ట్రావిస్ హెడ్ కొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అతివేగంగా 3వేల పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలిచాడు. అతను కేవలం 76 ఇన్నింగ్స్‌లో ఆ రికార్డును అందుకున్నాడు. గతంలో స్టీవ్ స్మిత్ 79 ఇన్నింగ్స్‌లో 3 వేల రన్స్ చేశాడు. ప్రస్తుతం సిడ్నీ వన్డేలో ఆస్ట్రేలియా తాజా సమాచారం ప్రకారం 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 80 రన్స్ చేసింది. మిచెల్ మార్ష్ 36, షార్ట్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
Mohammed Siraj with the opening breakthrough!
Gets the wicket of Travis Head, who departs after scoring 29 runs.
Prasidh Krishna with a fine catch at point.
Live – https://t.co/nnAXESYYUk #TeamIndia #AUSvIND #3rdODI pic.twitter.com/OtFVbvAetc
— BCCI (@BCCI) October 25, 2025