Mohammed Shami | ఇండోర్ : ఏడాది తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌కు రీఎంట్రీ ఇచ్చిన భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. బెంగాల్ తరఫున ఆడుతున్న షమీ.. 19 ఓవర్లు వేసి 54 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చోటు ఆశిస్తున్న షమీ.. ఇదే పునరావృతం చేస్తే రెండో టెస్టుకైనా జట్టుతో కలిసే చాన్స్ఉంది.