IND vs SL: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 48 ఏండ్ల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. వన్డే వరల్డ్ కప్ – 2023లో భాగంగా ముంబైలోని వాంఖెడే వేదికగా శ్రీలంకతో ముగిసిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించిన షమీ.. ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సార్లు ఫోర్ఫర్ (నాలుగు వికెట్ల ఘనత), ఫైఫర్ (ఐదు వికెట్లు) తీసిన బౌలర్ గా రికార్డులకెక్కాడు.
లంకతో మ్యాచ్‌లో ఐదు ఓవర్లు వేసిన షమీ ఒక్క మెయిడిన్ చేయడంతో పాటు 18 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా భారత్ తరఫున వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు జహీర్ ఖాన్‌తో పాటు జవగళ్ శ్రీనాథ్‌ల పేరిట ఉండేది. ఈ ఇరువురూ ప్రపంచకప్‌లో సంయుక్తంగా 44 వికెట్లు పడగొట్టారు. జహీర్ ఖాన్ 23 ఇన్నింగ్స్‌లలో , శ్రీనాథ్ 33 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకున్నారు. షమీ మాత్రం కేవలం 14 ఇన్నింగ్స్‌లలోనే 45 వికెట్లు సాధించాడు.
తాజా ప్రపంచకప్‌లో షమీ మూడు మ్యాచ్‌లలోనే 14 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన షమీ.. తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు వికెట్లు తీయగా లంకతోనూ అదే సీన్ రిపీట్ చేశాడు. ఇందులో ఒక ఫోర్ఫర్ రెండు ఫైఫర్లు ఉన్నాయి.
ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో నాలుగు వికెట్లు, అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్లలో.. షాహిద్ అఫ్రిది (4 సార్లు, 2011), మిచెల్ స్టార్క్ (4 సార్లు, 2019), మహ్మద్ షమీ (3 సార్లు, 2019), ఆడమ్ జంపా (3 సార్లు, 2019), మహ్మద్ షమీ (3 సార్లు, 2023) లు ఉన్నారు. అంతేగాక వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక ఫైఫర్లు సాధించినవారిలో మిచెల్ స్టార్క్ (3సార్లు) తర్వాత మహ్మద్ షమీ రెండో స్థానంలో ఉన్నాడు.
Mohammed Shami
– Highest wicket taker for India in World Cup (45) ✅
– Most 4-wkt hauls by any bowler in World Cup (7) ✅
– Joint-most 5-wkt hauls in World Cup (3 with Starc)
– Most 5-wkt hauls for India in ODIs (4) ✅
– Most 4-wkt hauls for India in ODIs (14) ✅#INDvSL… pic.twitter.com/oPZRyjeAfR
— Bharath Seervi (@SeerviBharath) November 2, 2023