హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాజస్థాన్ వేదికగా జరిగిన 34వ జాతీయ సీనియర్ వుషు టోర్నీలో తెలంగాణకు చెందిన మహమ్మద్ అవైస్ కాంస్య పతకంతో మెరిశాడు. శుక్రవారం జరిగిన సీనియర్ విభాగంలో బరిలోకి దిగిన నిజామాబాద్ ప్లేయర్ అవైస్ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ మూడో స్థానంలో నిలిచాడు. గత కొన్నేండ్లుగా నిజామాబాద్లో కోచ్ అబ్దుల్ ఒమర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న అవైస్.. జాతీయస్థాయి టోర్నీలో ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు అతన్ని అభినందించారు.