న్యూఢిల్లీ: భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ (Puja Tomar) సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో (UFC) బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది. లూయిస్విల్లే వేదికగా జరిగిన గేమ్‌లో బ్రెజిల్ ఫైటర్ రేయాన్నే అమండా డోస్ శాంటోస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. తొలి రౌండ్లో ప్రత్యర్ధిపై 30-27 స్కోర్‌తో పూజా పైచేయి సాధించింది. అయితే రెండో రౌండ్లో అమండా శాంటోస్.. పూజాను సమర్ధంగా ఎదుర్కొని 27-30 పాయింట్లతో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చింది. మూడో రౌండ్లో హోరాహోరీగా తలపడిన ఇద్దరు.. ఫైనల్ బెల్ మ్రోగే సమయానికి వరుస కిక్‌లతో అమండాను వెనక్కి నెట్టింది. దీంతో మూడో రౌండ్‌ను 29-28తో సొంతం చేసుకున్న ఆమె యూఎఫ్‌సీ చాంపియన్‌గా నిలిచింది.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. చాలా గర్వంగా ఉందని చెప్పింది. గెలుస్తాననే నమ్మకంతో తాను ఇక్కడి వచ్చానని తెలిపింది. చాలా కష్టపడినందువల్లే తాను ఈ స్థాయికి చేరానని వెల్లడించింది. ప్రేక్షకులు తనకు మద్దతుగా నిలిచారని 28 ఏండ్ల పూజా పేర్కొంది.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని బుధానా గ్రామంలో జన్మించిన పూజా.. చైనీస్ యుద్ధ కళ అయిన వుషుతో తన పోరాట క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించింది. వుషు గేమ్‌లో పూజ జాతీయ టైటిళ్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2012 లో సూపర్ ఫైట్ లీగ్‌తో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశించింది.
HISTORY CREATED BY PUJA TOMAR. 🇮🇳
– She becomes the first ever Indian woman to win the UFC match. pic.twitter.com/j4PkN04z8k
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2024
DEBUT DUBS 🙌
Puja Tomar takes the split decision at #UFCLouisville 🇮🇳 pic.twitter.com/IMYkYlcDKj
— UFC (@ufc) June 8, 2024