హైదరాబాద్, ఆట ప్రతినిధి: నేపాల్‌లో జరిగిన సౌత్ ఏషియన్ రాక్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు సభ్యుడిగా స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ క్రీడాకారుడు గోపాల్ యాదవ్‌ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే, ఎంఎల్ఆర్ఐటీ విద్యాసంస్థ ఫౌండర్ సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి అభినందించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పూడూరు గ్రామానికి చెందిన గోపాల్ విజయం దేశానికి, సంస్థకు ఎంతో గర్వకారణమని అన్నారు. గోపాల్ క్రీడా ప్రతిభను గుర్తించి ఎంఎల్ఆర్ఐటీలో 2017-2019 బ్యాచ్ ఎంబీఏలో అతనికి స్పోర్ట్స్ కోటాలో ఉచిత విద్యను అందించినట్టు తెలిపారు.
తమ సంస్థ తరఫున ఏటా దాదాపు రూ.1.5 కోట్ల విలువైన స్కాలర్షిప్లను అర్హులైన క్రీడాకారులకు అందిస్తూ ఉచిత విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. తమ సంస్థలో స్పోర్ట్స్ కోటాలో ఎంబీఏ పూర్తి చేసిన బాక్సింగ్ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ విజయాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.