నవీపేట, మే 6: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలా గ్రామానికి చెందిన మిట్టపల్లి రిత్విక స్విమ్మింగ్ వరల్డ్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికైంది. బెర్లిన్(జర్మనీ) నగరంలో జూలై 16 నుంచి 27 వరకు జరుగనున్న స్విమ్మింగ్ వరల్డ్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటుందని తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెంగళూరులో ఏప్రిల్ 24, 25వ తేదీల్లో స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా కుర్రాళ్లు
ముంబై: ఈ నెల 26 నుంచి మొదలుకానున్న ప్రతిష్టాత్మక టీ20 ముంబై లీగ్లో బుధవారం వేలం ప్రక్రియను నిర్వహించనున్నారు. ఆరేండ్ల విరామం తర్వాత జరుగనున్న ఈ టోర్నీలో ఇప్పటికే ఐపీఎల్లో సత్తా చాటుతున్న ముంబై, మహారాష్ట్రకు చెందిన పలువురు యువ క్రికెటర్లు ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఐపీఎల్-18లో చెన్నైకి ఆడుతున్న ఆయుష్ మాత్రెతో పాటు దేశవాళీలో ముంబైకి ఆడే ముషీర్, తనుష్, సిద్ధేశ్ లాడ్, శామ్స్, రఘువంశీ వంటి కుర్రాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు అమితాసక్తి చూపుతున్నాయి.