Womens World Cup : మహిళల వన్డే ప్రపంచ కప్ పోటీలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో రెండు రోజుల్లో అహ్మదాబాద్ స్టేడియం వేదికగా మెగా టోర్నీ ప్రారంభం కానుంది. మహిళా సాధికారితను చాటేలా ఈ ప్రపంచకప్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి భావిస్తోంది. అందుకే.. ఇప్పటికే పూర్తిగా మహిళా అంపైర్లు, రిఫరీలతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. ఇప్పుడు కామెంటటేర్స్గానూ అతివలకే పెద్ద పీట వేసింది ఐసీసీ. భారత వెటరన్ మిథాలీ రాజ్‌తో (Mithali Raj) పాటు పలువురు మాజీ క్రికెటర్లు తమదైన వ్యాఖ్యానంతో అభిమానులను అలరించనున్నారు.
భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ పోటీలతో మహిళా క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలపెట్టింది ఐసీసీ. విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని భారీగా పెంచడమే కాకుండా పూర్తిగా మహిళా బృందంతో కూడిన అంపైర్లు, రిఫరీలను ఎంపికచేసింది. ఇక కామెంటరీ బాక్స్‌లోనూ మహిళలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈసారి మెగా టోర్నీ మ్యాచ్‌ల సందర్భంగా మాజీ క్రికెటర్లు తమదైన విశ్లేషణతో సందడి చేయనున్నారు. ఇందులో టీమిండియా మాజీలు మిథాలీ రాజ్, సనా మిర్, అంజుమ్ చోప్రా (Anjum Chopra)లకు చోటు దక్కింది. వరల్డ్ కప్ విజేతలైన మెల్ జోన్స్, ఇషా గుహ, స్టాసీ అన్ కింగ్, జులియా ప్రైస్కూడా కామెంటరీ ప్యానెల్లో ఉన్నారు.
ICC has announced the elite list of commentators for CWC25.#CommentaryPanel #Commentators #IccWomensCricketWorldCup2025 #IsaGuha #MithaliRajhttps://t.co/IHSjAjHFCN
— CricketTimes.com (@CricketTimesHQ) September 28, 2025
‘స్వదేశంలో వరల్డ్ కప్ మ్యాచ్‌లను వీక్షించడం నిజంగా గొప్ప అనుభూతి. ప్రపంచ క్రికెట్లో ఇదొక వేడుక మాత్రమే కాదు భావితరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచే టోర్నీ. మాజీ క్రికెటర్‌గా ప్రపంచ కప్‌లో భాగం కావడంచాలా సంతోషంగా ఉంది. కామెంటరీ బాక్స్ నుంచి ఆటకు సంబంధించిన అప్డేట్స్ పంచుకునేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని మిథాలీ వెల్లడించింది.
It’s ODI World Cup time 🏆
Your one-stop destination to know all about the 13th edition of the tournament that will be co-hosted by India and Sri Lanka: https://t.co/3EPYQtWIC0 pic.twitter.com/ugth04MJM2
— ESPNcricinfo (@ESPNcricinfo) September 26, 2025
ప్రపంచ కప్ కామెంటేటర్స్ బృందంలోకి వరల్డ్ కప్ హీరోలను తీసుకుంది ఐసీసీ. వీళ్లలో దినేశ్ కార్తిక్, అరోన్ ఫించ్, కార్లోస్ బ్రాత్‌వైట్ వంటి పలువురు దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. అలానే.. రెగ్యులర్ కామెంటేటర్లు కటే మార్టిన్, ఇయాన్ బిషప్, నాటాష ఫర్రంట్, రస్సెల్ అర్నాల్డ్.. నటాలీ జెర్మనోస్, అలాన్ విల్కిన్స్, కాస్ నాయుడు, రౌనక్ కపూర్, జతిన్ సప్రూలు సైతం తమ కామెంటరీతో ఫ్యాన్స్‌ను అలరించనున్నారు.