Mitchell Starc : అస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ (Alyssa Healy) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలుతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు మార్చిలో ముగింపు పలుకుతున్నట్టు ఆమె వెల్లడించింది. అలీసా రిటైర్మెంట్ వార్తను ఆమె భర్త మిచెల్ స్టార్క్ (Mitchell Starc) తేలికగా తీసుకోలేకపోయాడు. హిట్ క్రికెట్ జోడీగా పేరొందిన తమలో ఒకరు ఆటకు అల్విదా చెప్పడంతో ‘మిస్సైల్ స్టార్క్’ భావోద్వేగానికి లోనయ్యాడు. తన భార్యను ఉద్దేశించి అతడు ప్రేమ, ఎమోషనల్ కలగలిపిన పోస్ట్ పెట్టాడు.
విధ్వసంక ఓపెనర్‌గా, సమర్ధురాలైన నాయకురాలిగా ఆసీస్ జట్టుకు విశేష సేవలందించింది అలీసా హేలీ. తన కెప్టెన్సీలోనే కంగారు జట్టును టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌కు చేర్చింది. నిరుడు భారత గడ్డపై రెండు సెంచరీలతో చెలరేగిన ఆమె.. తనలో మునపటి పరుగుల ఆకలి తగ్గిందని చెబుతూ రిటైర్మెంట్ ప్రకటించింది. స్వదేశంలో చివరిసారిగా భారత్‌తో వన్డే సిరీస్, ఏకైక టెస్టు మ్యాచ్ ఆడుతానని మంగళవారం అలీసా వెల్లడించింది.
A proud and supportive husband, Mitchell Starc 😍♥️#Cricket #Starc #Australia pic.twitter.com/MEZYBMHb1p
— Sportskeeda (@Sportskeeda) January 13, 2026
దాంతో.. తన భార్య సుదీర్ఘ కెరీర్ ముగియనుందని తెలిసి.. స్టార్క్ ఎమోషనల్ అయ్యాడు. ఆమె పచ్చిక బయలు సమీపంలో రిలాక్స్‌గా కూర్చొని.. డ్రింక్ సేవిస్తున్న అలీసా ఫోటోకు అతడు ప్రత్యేకమైన కామెంట్ రాశాడు. అందులో ‘థంబ్స్ అబ్’ సింబల్ చూపిస్తోంది. ఆ ఫొటోకు ‘నిన్ను చూసి గర్వపడుతున్నా’ అని రాసి, పక్కనే లవ్ ఎమోజీ పెట్టాడు స్టార్క్.
హీలీ, స్టార్క్ 2016 ఏప్రిల్ 15వ తేదీన పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. అవును.. వీరిద్దరూ తొమ్మిదేళ్ల వయసులో మొదటిసారి కలుసుకున్నారు. అప్పటి నుంచి ఒకరికొకరు బాగా తెలుసు. క్రికెట్ మీద దృష్టి సారించి ఇద్దరూ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. 2015లో స్టార్క్ తన మనసులోని మాటను అలీసా చెప్పాడు. ఆ ఏడాదే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మరుసటి ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టింది.
ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ మేనకోడలైన అలీసా హీలీ 19 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2010లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తను తొలి మ్యాచ్ ఆడింది. వికెట్ కీపర్‌గా, విధ్వంసక ఓపెనర్‌గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీలీ మూడేళ్ల క్రితం కెప్టెన్సీ చేపట్టింది. మేగ్ లానింగ్ వీడ్కోలు పలికిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తన.. యాషెస్ సిరీస్‌లో 16-0తో ఇంగ్లండ్‌పై అద్భుతమైన విజయాల రికార్డు నెలకొల్పింది. హీలీ సారథ్యంలో ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌లో, నిరుడు భారత్‌లో ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరింది. ఈ 16 ఏళ్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకూ ఈ వెటరన్ బ్యాటర్ 162 టీ20లు, 126 వన్డేలు, 11 టెస్టులు ఆడింది. వికెట్ల వెనకాల చురుకుగా కదులుతూ టీ20ల్లో 126 మందిని ఔట్ చేసింది.
Alyssa Healy will bow out as the most prolific ‘keeper in the women’s international game, as well as one of Australia’s most productive run scorers: https://t.co/4j3HV50o2m pic.twitter.com/AL3kNqJ2Xh
— cricket.com.au (@cricketcomau) January 12, 2026
‘త్వరలో భారత జట్టుతో ఆడబోయే సిరీసే నా కెరీర్లో చివరిది. సో.. మనసులో ఎన్నో భావోద్వేగాలు కలుగుతున్నాయి. నా దేశానికి ఆడడాన్ని ఇప్పటికీ ఇష్టపడుతున్నా. అయితే.. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాలోని పోరాట స్ఫూర్తి ఇప్పుడు తగ్గిపోయింది. అందుకే.. వీడ్కోలుకు సమయం వచ్చేసిందని భావిస్తున్నా. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో నేను ఆడడం లేదు. సన్నద్ధతకు సమయం తక్కువ ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నా. స్వదేశంలో భారత్‌తో వన్డే, ఏకైక టెస్టులో కెప్టెన్సీ వహించి నా కెరీర్‌ను ఘనంగా ముగించాలని అనుకుంటున్నా.
I’m honestly so sad and stunned to hear that Alyssa Healy is retiring. I really thought she’d be part of the upcoming T20 WC. It’s going to feel strange without Harly’s rivalry. I’ll definitely miss it. 💔
©Willow Talk pic.twitter.com/zqCdVSap4z
— 🥪 (@lykiriArrax) January 12, 2026
నేను కచ్చితంగా నా సహచరులను మిస్ అవుతాను. వారితో కలిసి టీమ్ సాంగ్ పాడుతూ ఇన్నింగ్స్ ఆరంభించడం వంటివి మిస్ అవుతాను. ఆస్ట్రేలియా తరఫున ఆడడం నాకు జీవితంలో దక్కిన అత్యంత గొప్ప గౌరవం. బంగారం, ఆకుపచ్చ రంగు జెర్సీలో చివరి సిరీస్ ఆడబోతున్నందుకు గర్వంగా ఉంది’ అని హీలీ తన రిటైర్మెంట్ వార్తను వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బెర్గ్ మహిళా క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన హీలీని ప్రశంసించాడు. మైదానం లోపలా, వెలుపలా యువతరాన్ని ప్రభావితం చేసేలా నడుచుకున్న ఆమెను ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరిగా అభివర్ణించాడు.