సిడ్నీ: ఈ సీజన్లో పడుతూ లేస్తూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త. భుజం, మోచేయి గాయం కారణంగా సీజన్లో ఆరు మ్యాచ్‌లకు దూరమైన ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ త్వరలోనే టీమ్‌తో కలువనున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా స్టార్క్ ఐపీఎల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
నిరుడు యాషెస్ టెస్టు అనంతరం బిగ్ బాష్ లీగ్‌లో ఆడిన స్టార్క్.. గాయం కారణంగా ఇన్నాళ్లూ పునరావాసం పొందాడు. ఇటీవలే అతడు పూర్తి ఫిట్నెస్ సాధించిన నేపథ్యంలో సీఏ నుంచి స్టార్క్‌కు లైన్ క్లీయర్ అయింది.