IPL Mock Auction 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో ఆసీస్ సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ భారీ ధర దక్కించుకున్నాడు. గతంలో అతడు ప్రాతినిథ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని ఏకంగా రూ. 18.5 కోట్లు పెట్టి దక్కించుకుంది. వన్డే ప్రపంచకప్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన సౌతాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోయెట్జ్ కూడా రూ. 18 కోట్ల ధర పలకగా ఆసీస్ సారథి పాట్ కమిన్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 17.50 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. గత రెండు సీజన్లలో అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా విఫలమవుతున్న శార్దూల్ ఠాకూర్ అయితే ఏకంగా రూ. 14 కోట్ల ధర దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది..
అదేంటి..? ఐపీఎల్ – 2024 సీజన్ కోసం వేలం జరగాల్సింది మంగళవారం (డిసెంబర్ 19న) కదా.. మరి ఈ వేలం ఎక్కడిది..? అనుకుంటున్నారా..? ఆగండాగండి. ఇది ఒరిజినల్ యాక్షన్ కాదు. వేలానికి ముందు నిర్వహించే ఐపీఎల్ మాక్ ఆక్షన్. వేలానికి ముందు జియో సినిమా దీనిని నిర్వహించింది. భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, పార్థీవ్ పటేల్, అనిల్ కుంబ్లేతో పాటు ఆర్సీబీ మాజీ డైరెక్టర్ మైక్ హెసెన్, ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్‌లు ఈ ఉత్తుత్తి వేలంలో పాల్గొన్నారు.
#ICYMI – Here are the top picks from the Auction War Room 🤯
Don’t miss the Match Centre LIVE action as bidding war goes intense 👉 streaming FREE on #JioCinema! #IPLAuctiononJioCinema #IPLonJioCinema #JioCinemaSports pic.twitter.com/Or38mzQVDB
— JioCinema (@JioCinema) December 18, 2023
హైదరాబాద్ తరఫున యాక్షన్‌లో పాల్గొన్న మోర్గాన్.. కమిన్స్‌కు భారీ ధరకు వెచ్చించగా గుజరాత్ తరఫున పార్థీవ్ పటేల్ కొయెట్జ్ కోసం పోటాపోటీగా వేలం పాడాడు. ఇక తన సుదీర్ఘ కెరీర్లో చెన్నై సూపర్ కింగ్స్‌తోనే ఆడిన సురేశ్ రైనా.. సీఎస్కే ప్రతినిధిగా వ్యవహరించి వనిందు హసరంగ, ట్రావిస్ హెడ్, జోష్ హెజిల్వుడ్ వంటి ఆటగాళ్లను దక్కించుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న అనిల్ కుంబ్లే.. ఎవరూ ఊహించని విధంగా శార్దూల్ ఠాకూర్‌కు రూ. 14 కోట్ల ధర పలకడం విశేషం. లంక యువపేసర్ దిల్షాన్ మధుశంకను కోల్‌కతా నైట్ రైడర్స్.. రూ. 10.50 కోట్లకు దక్కించుకుంది. అయితే మాక్ ఆక్షన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లంతా ప్రధానంగా బౌలర్లే కావడం గమనర్హాం. అంటే రేపు దుబాయ్‌లో జరుగబోయే అసలైన వేలంలో కూడా పది ఫ్రాంచైజీలు బౌలర్ల మీదే దృష్టి సారించనున్నాయని తెలుస్తున్నది.
Mike Hesson gets the marquee pacer for his team – Would Mitch Starc be back in 🔴 for #RCB tomorrow?
Don’t miss Match Centre LIVE Auction War Room 👉 streaming FREE on #JioCinema! 🙌🏻#IPLAuctiononJioCinema #IPLonJioCinema #JioCinemaSports pic.twitter.com/gSCdmK3dB0
— JioCinema (@JioCinema) December 18, 2023