Mitchell Starc: ఆస్ట్రేలియా (Australia) వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ (Twenty20 Internationals) నుంచి తప్పుకుంటున్నట్లు (Retirement) వెల్లడించాడు. ఇకపై టెస్ట్‌లు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే ఐపీఎల్ సహా దేశవాలీ టీ20 లీగ్‌లకు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు.
ఆస్ట్రేలియా తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఈ 35 ఏండ్ల ఫాస్ట్ బౌరల్.. 2012లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. మొత్తం 65 మ్యాచ్‌లు ఆడిన అతడు 7.74 ఎకానమీరేట్తో 79 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఆడమ్ జంపా (130) తర్వాత ఆస్ట్రేలియా తరఫున రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. కాగా, 2024 నుంచి స్టార్క్ టీ20లకు దూరంగా ఉంటున్నాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో స్టార్క్ 2021 వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ దశను అనుభవించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. టీ20ల్లో ఆసీస్‌కు అదే తొలి వరల్డ్‌కప్. ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు మొత్తం ఆరు ప్రపంచకప్‌లు జరుగగా స్టార్క్.. ఐదింటిలో పాల్గొన్నాడు. 2016 ఎడిషన్‌కు దూరంగా ఉన్నాడు.
టీ20 కెరీర్లో ప్రతి మ్యాచ్‌ను, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని స్టార్క్ తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. ఇందులో 2021 వరల్డ్‌కప్ హైలైట్‌గా ఉంటుందని చెప్పాడు. ఆస్ట్రేలియా తరఫున పొట్టి ఫార్మాట్‌ను ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేశానని చెబుతూనే, టెస్ట్‌లకే తన మొదటి ప్రాధాన్యం అని స్పష్టం చేశాడు. భారత పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే వరల్డ్‌కప్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఆయా టోర్నీలకు ఫిట్‌గా, ఫ్రెష్‌గా ఉండేందుకు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాని వెల్లడించాడు.
Test cricket is and has always been my highest priority,
I have loved every minute of every T20 game I have played for Australia, particularly the 2021 World Cup, not just because we won but the incredible group and the fun along the way. pic.twitter.com/sGe8l4upQm
— Mitch Starc (@mstarc56) September 2, 2025
🚨 Mitchell Starc retires from T20Is 🚨
79 wkts • 🥈 2nd highest AUS T20I wicket-taker • 🇦🇺 most by a pacer • 🏆 T20WC winner
Focus now Tests 🏏, Ashes 🔥, India tour 🇮🇳 & ODI WC 2027 🏆
A true legend. Thank you, GOAT 🐐💛#MitchellStarc #ThankYouStarc #Cricket #AUS #Legend pic.twitter.com/PGqMoXhtGT— Kholinati!on_👑🚩 (@cryptoHolder09) September 2, 2025