Mitchell Santner: ఒంటి చేతితో శాంట్నర్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో
Mitchell Santner: మిచెల్ శాంట్నర్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. ఒంటి చేతితో గాలిలో ఎగురుతూ బంతిని అందుకున్నాడు. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో అతను ఆ క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్‌కు చెందిన వీడియోను ఐసీసీ పోస్టు చేసింది.
చెన్నై: న్యూజిలాండ్ ఫీల్డర్ మిచెల్ శాంట్నర్(Mitchell Santner) స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టేశాడు. వెనుక వైపు గాలిలో ఎగురుతూ ఒంటి చేతితో క్యాచ్‌ను అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో చెన్నైలో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో.. శాంట్నర్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ పట్టేశాడు. ఆ క్యాచ్‌పై ఐసీసీ తన వీడియోలో స్క్రీమర్ అలర్ట్ ప్రకటించింది. కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌కు పేరుగాంచిన న్యూజిలాండ్.. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన ఇచ్చింది. అయితే చేజింగ్ సమయంలో ఫెర్గూసన్ వేసిన 14వ ఓవర్లో శాంట్నర్ పట్టిన క్యాచ్ టోర్నమెంట్కే హైలెట్‌గా నిలిచింది. ఆ క్యాచ్‌ను పట్టిన తీరు చూసి తీరాల్సిందే. అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షార్ట్‌బాల్‌ను పుల్ చేసేందుకు ప్రయత్నించగా.. అది కాస్తా గాల్లోకి లేచింది. సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న శాంట్నర్ వెనక్కి పరిగెడుతూ.. అసాధ్యం అనుకుంటున్న సమయంలో ఒంటిచేత్తో బంతిని ఒడిసి పట్టి ఔరా అనిపించాడు. ఆ క్యాచ్ వీడియో ఇదే.
ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. బుధవారం చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన పోరులో 149 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను మట్టికరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (71; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), టామ్ లాథమ్ (68; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విల్ యాంగ్ (54; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు.
అఫ్గాన్ బౌలర్ల ధాటికి ఒక దశలో ఒక పరుగు వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి 110/4తో కష్టాల్లో పడ్డట్లు కనిపించిన కివీస్‌ను కెప్టెన్ లాథమ్, ఫిలిప్స్ ఆదుకున్నారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ.. క్రీజులో కుదురుకున్నాక బౌండ్రీల మోత మోగించింది. అనంతరం అఫ్గాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా (36) టాప్ స్కోరర్ కాగా.. రహ్మానుల్లా (11), ఇబ్రహీం (14), హష్మతుల్లా (8), అజ్మతుల్లా (27), ఇక్రామ్ (19), మహమ్మద్ నబీ (7), రషీద్ ఖాన్ (8) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో శాంట్నర్, ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

