Mitchell Marsh | న్యూఢిల్లీ: లీగ్‌లో ఇప్పటికే పడుతూ లేస్తూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయానికి చికిత్స కోసం స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్వదేశం ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లాడు. దీంతో లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు మార్ష్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈ నెల 3న చివరి మ్యాచ్ ఆడిన మార్ష్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉంటే జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో చర్చించిన తర్వాతే మిచెల్ స్వదేశానికి పయనమైనట్లు తెలిసింది.