Asia Cup 2025 : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆసియా కప్ (Asia Cup) కోసం స్క్వాడ్‌ను ప్రకటించింది. లిటన్ దాస్ (Litton Das) సారథిగా పదహారు మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఆసియా కప్‌ను అందుకోని బంగ్లా ఈసారి తమ కలను నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అందుకే.. పటిష్టమైన స్క్వాడ్‌తో బరిలోకి దిగుతోంది. సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో కూడిన జాబితాలో వికెట్ కీపర్ బ్యాటర్ నురుల్ హసన్‌కు చోటు లభించింది.
దాదాపు మూడేళ్ల తర్వాత నురుల్ టీ20లకు ఎంపికవ్వగా.. సైఫ్ హొసేన్ ఏడాదిన్నర తర్వాత ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. మాజీ సారథి నజ్ముల్ హుసేన్ శాంటోను మాత్రం పక్కన పెట్టేశారు. పొట్టి ఫార్మాట్ జట్టులో ఒకడైన ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్, సౌమ్యా సర్కార్, తన్వీర్ ఇస్లాంలు మెయిన్ స్క్వాడ్‌లో కాకుండా స్టాండ్‌బైగా సెలెక్ట్ అయ్యారు.
🔙 Nurul Hasan, whose last T20I was in 2022, gets a recall
❌ Mehidy Hasan Miraz can’t find a place; named as a stand-by #AsiaCup pic.twitter.com/LPMmHUMsWI— ESPNcricinfo (@ESPNcricinfo) August 22, 2025
బంగ్లాదేశ్ స్క్వాడ్ : లిటన్ దాస్(కెప్టెన్), తంజిద్ హసన్, పర్వేజ్ హొసేన్ ఎమాన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, జకీర్ అలీ అనిక్, షమీమ్ హొసేన్, ఖాజీ నురుల్ హసన్, మెహిదీ హసన్, రిషద్ హొసేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్.
స్టాండ్ బై : సౌమ్యా సర్కా్ర్, మెహిది హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహ్ముద్.