3 రోజులు చుక్క నీరు ముట్టలేదు.. బరువు నియంత్రణపై చాను కామెంట్స్
కామన్వెల్త్ గేమ్స్ తాజా ఎడిషన్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను పోటీలకు ముందు బరువు నియంత్రణ ఎలా చేసుకున్నదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళల 48 కిలోల విభాగంలో పసిడి నెగ్గిన అనంతరం తనను కలిసిన పాత్రికేయులతో మాట్లాడుతూ.. ‘త్వరత్వరగా ముగించండి.
గ్లాస్గో : కామన్వెల్త్ గేమ్స్ తాజా ఎడిషన్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను పోటీలకు ముందు బరువు నియంత్రణ ఎలా చేసుకున్నదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళల 48 కిలోల విభాగంలో పసిడి నెగ్గిన అనంతరం తనను కలిసిన పాత్రికేయులతో మాట్లాడుతూ.. ‘త్వరత్వరగా ముగించండి. రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు. ఈ పోటీల కోసం నా బరువును నియంత్రణలో ఉంచుకోవడం నాకు అతిపెద్ద సవాల్‌గా నిలిచింది. నాకే కాదు. ఏ అథ్లెట్‌కైనా ఇది చాలా కష్టంతో కూడుకున్న పరీక్ష.
నేను 48 కేజీల విభాగంలో పోటీపడుతున్నా. నా సాధారణ బరువు 50.5 కిలోలు. 49 కి.కు రావడానికి నాకేం కష్టం అనిపించలేదు. కానీ 48 కిలోలకు రావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. దానికోసం రెండు రోజులుగా నోటికి తాళం వేశా. ముఖ్యంగా మూడు రోజుల నుంచి చుక్క నీరు కూడా ముట్టలేదు. ఇక నా శరీరంలో బరువు తగ్గించుకునేందుకు చోటే లేదు’ అంటూ వ్యాఖ్యానించింది. వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ వంటి క్రీడల్లో బరువు నియంత్రణ అనేది అత్యంత కీలకమన్న విషయం విదితమే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

