లండన్: భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టుకు ఎంపికైన మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతడి స్థానంలో డాన్ లారెన్స్‌ను ఎంపిక చేసింది. లారెన్స్ సోమవారం హైదరాబాద్‌లో ఇంగ్లండ్ టీమ్‌తో కలుస్తాడని ఆ దేశ బోర్డు ప్రకటించింది. ‘బ్రూక్ సిరీస్ నుంచి అత్యవసర కారణాల వల్ల తప్పుకున్నాడు. అతడి స్థానంలో లారెన్స్‌ను ఎంపిక చేశాం’ అని వెల్లడించింది.