బెర్లిన్: ఫార్ములా వన్ స్టార్ డ్రైవర్ మైఖేల్ షూమాకర్(Michael Schumacher) కుటుంబం .. ఏఐ ఇంటర్వ్యూ కేసులో భారీ నష్టపరిహారాన్ని గెలిచింది. జర్మనీ మ్యాగ్జిన్ ఏఐ ఆధారిత ఇంటర్వ్యూను పబ్లిష్ చేసిన కేసులో.. షూమాకర్ కుటుంబానికి 2 లక్షల యూరోలు చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది. ఫార్ములా వన్ రేసును షూమాకర్ ఏడు సార్లు గెలిచిన విషయం తెలిసిందే. ఫేక్ ఏఐ ఇంటర్వ్యూ కేసులో మునిచ్ లేబర్ కోర్టు తీర్పును వెలువరించినట్లు షూమాకర్ ఫ్యామిలీ తెలిపింది. ఫంకే మీడియా గ్రూపు దీన్ని సెటిల్ చేసింది. డై అక్తుల్లే మ్యాగ్జిన్ .. షూమాకర్పై కథనాన్ని ప్రచురించింది. గత ఏడాది మ్యాగ్జిన్ ఎడిటర్‌ను తొలగించారు. షూమాకర్ ఫ్యామిలీకి ఫంకే మీడియా గ్రూపు క్షమాపణలు చెప్పింది.
55 ఏళ్ల ఫెరారీ డ్రైవర్ షూమాకర్.. చాన్నాళ్ల నుంచి ఆయన పబ్లిక్‌లో కనిపించడం లేదు. 2013లో ఆల్ప్స్ పర్వతాల్లో స్కీయింగ్ చేస్తుండగా ఆయన మెదడుకు గాయమైన విషయం తెలిసిందే. అయితే ఆ డ్రైవర్ ప్రైవసీ గురించి ఫ్యామిలీ సమాచారాన్ని అత్యంత రహస్యంగా దాస్తోంది. 2023 ఏప్రిల్‌లో డై అక్తుల్లే అనే మ్యాగ్జిన్ తన ఫ్రెంట్ కవర్ పేజీలో షూమాకర్ ఇంటర్వ్యూను పబ్లిష్ చేసింది.