డల్లాస్: అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) టోర్నీ మూడో టైటిల్‌ను ఎంఐ న్యూయార్క్ సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి ఇక్కడి గ్రాండ్ ప్రేరి స్టేడియంలో జరిగిన మూడో సీజన్ ఫైనల్లో న్యూయార్క్.. 5 పరుగుల తేడాతో వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై గెలిచి ఈ టోర్నీలో తమ రెండో టైటిల్‌ను గెలుచుకుంది. తుదిపోరులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూయార్క్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 రన్స్ చేసింది. న్యూయార్క్ జట్టులో క్వింటన్ డికాక్ (77) దూకుడుగా ఆడాడు. అనంతరం వాషింగ్టన్.. 20 ఓవర్లకు 175/5 వద్దే ఆగిపోయింది. రచిన్ రవీంద్ర (70), గ్లెన్ ఫిలిప్స్ (48) పోరాడినా ఆ జట్టు గెలుపు ముంగిట బోల్తా కొట్టింది.