సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (27 నాటౌట్), ఇషాన్ కిషన్ (22 నాటౌట్) ఇద్దరూ రాణించారు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై జట్టు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 51 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ సారధి కేన్ విలియమ్సన్ ఎన్ని ఎంత మంది బౌలర్లను మార్చినా వికెట్ మాత్రం పడలేదు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ మిడిలార్డర్ ధాటిగా ఆడటంతో 193 పరుగుల భారీ స్కోరు చేసింది.