ముంబైకి ఈ ఐపీఎల్లో వరుసగా మూడో పరాజయం ఎదురైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు సూర్యకుమార్ యాదవ్ (52), తిలక్‌వర్మ (38 నాటౌట్), డెవాల్డ్ బ్రెవిస్ (29), కీరన్ పొలార్డ్ (5 బంతుల్లో 22 నాటౌట్) రాణించడంతో 20 ఓవర్లకు 161 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో కేకేఆర్‌ను మిల్స్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. రహానే (10)ను షార్ట్‌బాల్‌తో బోల్తా కొట్టించాడు.
ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ (10), శామ్ బిల్లింగ్స్ (17), నితీష్ రాణా (8), ఆండ్రీ రస్సెల్ (8) వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్‌కు క్యూ కట్టడంతో కేకేఆరో ఓటమి ఖాయమనే అంతా అనుకున్నారు. వెంకటేశ్ అయ్యర్ (50 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. అయితే రస్సెల్ అవుటైన తర్వాత ఈ ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్నఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ క్రీజులోకి వచ్చాడు.
వచ్చినప్పటి నుంచే బౌండరీని లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఊపులో 16వ ఓవర్ చివరి బంతికి భారీ సిక్సర్‌తో కోల్‌కతాకు విజయాన్ని కట్టబెట్టాడు. ముంబై బౌలర్లలో టైమల్ మిల్స్, మురుగన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు తీయగా.. డానియెల్ శామ్స్ ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
A 𝙕𝙊𝙍𝘿𝘼𝘼𝘼𝘼𝘼𝘼𝙍 victory in Pune! 💜#KKRHaiTaiyaar #KKRvMI #IPL2022 pic.twitter.com/t5rX0fgG1L
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2022
PAT CUMMINS Supremacy 🔥@patcummins30 #KKRHaiTaiyaar #KKRvMI #IPL2022 pic.twitter.com/NhgfqOag0B
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2022