MI vs CSK | ఐపీఎల్ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్లో అత్యధిక సీజన్లలో గెలిచిన ఈ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఈసారి పాయింట్ల పట్టికలో చాలా వెనుకంజలో ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లోనూ గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది.