IPL 2026 | ఆశా భోంస్లేకు క్రికెటర్ల నివాళి.. నిశబ్దంగా వాంఖడే స్టేడియం..!
IPL 2026 : ప్రముఖ గాయని ఆశా భోంస్లే (Asha Bhosle)కు క్రికెటర్లు నివాళులు అర్పించారు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు గాయని మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఒక నిమిషం మౌనం పాటించారు.
IPL 2026 : ప్రముఖ గాయని ఆశా భోంస్లే (Asha Bhosle)కు క్రికెటర్లు నివాళులు అర్పించారు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు వాంఖడే స్టేడియంలో దివంగత గాయని మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఒక నిమిషం మౌనం పాటించారు. ఇరుజట్ల సహాయక సిబ్బంది, అంపైర్లు, మైదానంలోని అభిమానులు సైతం లేచి నిల్చొని దిగ్గజ సింగర్కు నివాళులు అర్పించారు.
వాంఖడేలో మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబై, ఆర్సీబీ ఆటగాళ్లు ఆశా భోంస్లేకు నివాళులు అర్పించారు. ఇరుజట్ల క్రికెటర్లు, సహాయక సిబ్బంది, అంపైర్లు, ప్రేక్షకులు అందరూ ఒక నిమిషం మౌనం పాటించి లెజెండరీ సింగర్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
A moment of silence at Wankhede as we remember and pay tribute to the legendary Asha Bhosle Tai.
Our players are wearing black armbands as a mark of respect. pic.twitter.com/YyHUYd8EY5
— Mumbai Indians (@mipaltan) April 12, 2026
శివాజీ పార్క్లో అంత్యక్రియలు
భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక ధ్రువతారగా వెలిగిన ఆశా భోంస్లే ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఊపిరితిత్తులు, హృదయ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆమెను బతికేంచేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. కుమారుడు ఆనంద్ భోంస్లే ఆమె మరణ వార్తను వెల్లడించారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఆమె పార్థీవ దేహాన్ని చూసేందుకు అభిమానులకు అనుమతిస్తామని, సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్లో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆనంద్ భోస్లే పేర్కొన్నారు.
#WATCH | Mumbai: Legendary singer Asha Bhosle’s son, Anand Bhosle says, “My mother passed away today. People can pay their last respects to her at 11 am tomorrow at Casa Grande, Lower Parel, where she lived. Her last rites will be performed at 4 pm tomorrow at Shivaji Park.” https://t.co/enJlEizboY pic.twitter.com/4WqTd9HYxg
— ANI (@ANI) April 12, 2026
బాలీవుడ్లో నేపథ్య గాయనిగా తన ముద్ర వేసిన ఆశా భోంస్లే ప్రస్థానం అద్భుతంగా సాగింది. మహారాష్ట్రలోని సాంగ్లీలో 1933 సెప్టెంబర్ 8న జన్మించారు ఆశ. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు దీనానాథ్ మంగేష్కర్ వారసురాలిగా చిన్నతనంలోనే సంగీత ఓనమాలు నేర్చుకున్నారు. తన 10వ ఏటనే (1943) ‘మాఝా బల్’ అనే మరాఠీ చిత్రం ద్వారా గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె 1948లో ‘చునరియా’ చిత్రంలోని “సావన్ ఆయా” పాటతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు.
అవార్డులు..
తన సుమధుర గాత్రంతో కోట్లాది మంది మనసులు గెలిచిన ఆశా భోంస్లే 20కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో సుమారు 12,000కు పైగా పాటలు ఆలపించారు. అత్యధిక స్టూడియో రికార్డింగ్స్ చేసిన గాయనిగా 2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. భారత ప్రభుత్వం ఆమెను 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో, 2008లో పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

