హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సీజన్లో 16 జట్లు నాలుగు గ్రూపుల్లో తలపడుతున్నాయి. ఆదివారం వూటీ గోల్ఫ్ కౌంటీలో జరిగిన తొలి రౌండ్లో మీనాక్షి మేవరిక్స్ జట్టు 210 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది. గ్రూప్-డిలో బరిలో దిగిన మేవరిక్స్ జట్టులో నలుగురు గోల్ఫర్లు తలో 36 పాయిం ట్లు సాధించారు. గ్రూప్ దశలో టాప్-8లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరుతాయి. తుదిపోరు బ్యాంకాక్ వేదికగా నిర్వహించనున్నారు.