MCA : ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎన్నికలు ముగిశాయి. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)కూడా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్న విషయం తెలిసిందే. మరో నెల రోజుల్లో ముంబై క్రికెట్ సంఘం (MCA) ఎన్నికలకు తేరలేవనుంది. ఇప్పుడున్న సభ్యుల పదవీకాలం ముగియడంతో నవంబర్ 12వ తేదీన ఎంసీఏ బోర్డుకు కొత్త సభ్యులను ఎన్నుకోనున్నారు.
అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, ముంబై టీ20 గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్‌ను ఇదే రోజున ఎన్నుకుంటారు. ఎలక్షన్స్ నిర్వహణ బాధ్యతలను సీనియర్ అధికారికి అప్పగించారు. మాజీ చీఫ్ సెక్రటరీ, మహారాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి జేఎస్ సహారియాను ఎలక్టోరల్ ఆఫీసర్‌గా గురువారం అపెక్స్ కౌన్సిల్ నియమించింది.
Mumbai Cricket Association Apex Council Decisions
The #MCA Apex Council, in its meeting held on 8th October 2025, took several key decisions for the development of cricket and social welfare:
1. Installation of a life-size statue of Shri Dilip Vengsarkar at Wankhede Stadium.… pic.twitter.com/33tUu5JsBQ— Ajinkya Naik – President, MCA. (@ajinkyasnaik) October 9, 2025
ప్రస్తుతం ఎంసీఏ అధ్యక్షుడిగా అజింక్యా నాయక్ ఉండగా.. సంజయ్ నాయక్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కార్యదర్శిగా అభయ్ హదప్, సంయుక్త కార్యదర్శిగా దీపక్ పాటిల్, అర్మాన్ మాలిక్ కోశాధికారిగా పని చేస్తున్నారు. వీరంతా మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది.