Yashasvi – Rohit : టెస్టు క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) ఓపెనర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. సెంచరీల మీద సెంచరీలతో రికార్డులు బద్ధలు కొడుతున్న ఈ కుర్రాడు ఇంగ్లండ్ గడ్డ మీదా తన సత్తా చాటి జట్టు విజయంలో భాగమయ్యాడు. విధ్వంసంక బ్యాటింగ్‌తో చెలరేగే యశస్వీ ఏ జట్టులో ఉన్నా కెప్టెన్‌కు కొండంత బలం. అందుకే.. అతడిని వదులుకునేందుకు ఎవరూ సిద్ధపడరు. సరిగ్గా ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కూడా అదే చేసింది. యశస్వీ యూ టర్న్‌లో కీలక పాత్ర రోహిత్దేనట. ఈ విషయాన్ని గురువారం ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ (Ajinkya Naik) వెల్లడించాడు.
దేశవాళీ సీజన్ 2024-25కు ముందే యశస్వీ ముంబైని వీడాలనుకున్నాడు. గోవాకు ఆడాలనే ఉద్దేశంతో ఈ చిచ్చరపిడుగు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశాడు. అయితే.. నెల తిరకుండానే అనూహ్యంగా యూ టర్న్ తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అతడిని ముంబైకే ఆడేలా రోహిత్ అతడిని ఒప్పించాడని అజింక్యా తెలిపాడు. ‘యశస్వీని ముంబైకే ఆడాలని రోహిత్ ఒప్పించాడు.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Indian ODI skipper Rohit Sharma stopped Yashasvi Jaiswal’s move from Mumbai to Goa! 🏏
Later, the left-handed batter had withdrawn his NOC for the transfer. 🤝#YashasviJaiswal #Mumbai #RohitSharma #Sportskeeda pic.twitter.com/ccDVDcFW0M
— Sportskeeda (@Sportskeeda) August 7, 2025
కెరీర్లో ఎదుగుతున్న క్రమంలో ముంబైలాంటి మేటి జట్టును వీడడం మంచిది కాదని అతడికి అర్ధమయ్యేలా చెప్పాడు హిట్‌మ్యాన్. రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ విజేతగా నిలిచిన జట్టుకు ఆడడం గర్వంగా ఉంటుందని వివరించాడు. ‘ముంబై క్రికెట్ సంఘం నీ కెరీర్ నిర్మాణంలో ఎంతగా ఉపకరించిందో గుర్తు చేసుకో’ అని యశస్వీ మనసు మార్చాడు’ అని ఎంసీఏ చీఫ్ వివరించాడు.
యశస్వీ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అయితే.. అతడి క్రికెటర్‌గా ఎదిగింది.. రంజీ ట్రోఫీ అవకాశం దక్కించుకుంది మాత్రం ముంబైలోనే. టీనేజర్‌గా 2019లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన యశస్వీ.. ఐపీఎల్‌తో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఏడాది కింద వెస్టిండీస్ పర్యటనతో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన అతడు తొలి మ్యాచ్‌లోనే శతకంతో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌పై వీరబాదుడుతో.. డబుల్ సెంచరీ సాధించి భావి తారగా ప్రశంసలు అందుకున్నాడు.
ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వీ సూపర్ సెంచరీతో మెరిశాడు. నైట్‌వాచ్‌మన్ ఆకాశ్ దీప్తో 107 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. మాజీ సారథి రోహిత్ శర్మ సందేశంతో శతక్కొట్టానని మ్యాచ్ అనంతరం యశస్వీ చెప్పిన విషయం తెలిసిందే.