IPL 2023 : ఐపీఎల్ డబుల్ హెడర్‌లో లక్నోలక్నో సూపర్ జెయింట్స్(LSG) భారీ స్కోర్ చేసింది. 6 వికెట్ల నష్టానికి 193 రన్స్ కొట్టింది. ఓపెనర్ కైలీ మయర్ (73) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్(36), బదొని(18) సిక్స్‌లతో చెలరేగారు. చేతన్ సకారియా వేసిన ఆఖరి ఓవర్లో మూడు సిక్స్‌లతో లక్నో బ్యాటర్లు 22 పరుగులు రాబట్టారు. ఢీల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్(8) విఫలమయ్యాడు. అయితే.. మరో ఓపెనర్ కైలీ మేయర్ (73) సిక్స్‌లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత దూకుడు పెంచిన అతను 38 బంతుల్లో 7 సిక్స్‌లతో 73 రన్స్ కొట్టాడు. దీపక్ హుడా (17)తో రెండో వికెట్‌కు 79 రన్స్ జోడించాడు. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ (12) తొందరగానే వెనుదిరిగాడు. దాంతో, లక్నో 150 ప్లస్ స్కోర్ చేయడం కష్టమనిపించింది. కానీ, పూరన్(36), బదొని(18) సిక్స్‌లతో చెలరేగడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది.