Vijay Hazare Trophy | దేశవాళీ క్రికెట్లో మయాంక్, హుడా శతకాల మోత
Vijay Hazare Trophy : సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్(ODI World Cup) జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal), ఆల్‌రౌండర్ దీపక్ హుడా(Deepak Hooda) దేశవాళీలో దంచికొడుతున్నారు. మళ్లీ టీమిండియా జెర్సీపై కన్నేసిన ఈ ఇద్దరూ విజయ్‌హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy) ఆరంభం రోజే...
Vijay Hazare Trophy : సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్(ODI World Cup) జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal), ఆల్‌రౌండర్ దీపక్ హుడా(Deepak Hooda) దేశవాళీలో దంచికొడుతున్నారు. మళ్లీ టీమిండియా జెర్సీపై కన్నేసిన ఈ ఇద్దరూ విజయ్‌హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy) ఆరంభం రోజే శతకాలతో చెలరేగారు. కర్నాటకకు ఆడుతున్న మయాంక్.. జమ్ముకశ్మీర్ బౌలర్లను ఉతికారేస్తూ 157 పరుగులు సాధించాడు.
అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ 137 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. ఓపెనర్‌గా వచ్చి 44వ ఓవర్ వరకూ ఆడిన మయాంక్ డబుల్ సెంచరీ కొట్టేలా కనిపించాడు. కానీ, సహిల్ లోత్రా అతడిని వెనక్కిపంపాడు. ఆ తర్వాత వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ 35 బంతుల్లో 71 రన్స్ చేయడంతో కర్నాటక తొలి రోజు 2 వికెట్ల నష్టానికి 402 పరుగులు కొట్టింది.
దీపక్ హుడా

3 వికెట్లు పడ్డాక..
ఇక మరో మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ దీపక్ హుడా.. అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై సెంచరీ బాదాడు. ఈ ఆల్‌రౌండర్ 103 బంతుల్లో 15 ఫోర్లు,2 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. అరుణాచల్ బౌలర్ల ధాటికి టాపార్డర్ బ్యాటర్లలో ముగ్గురు 5.1 ఓవర్లకే పెవిలియన్ చేరారు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన హుడా విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు. దాంతో, తొలి రోజు రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 537 రన్స్ చేయగలిగింది.
ఇవి కూడా చదవండి
-
Sabarimala temple | శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద పాముకాటుకు గురైన చిన్నారి
-
IRCTC | టెక్నికల్ సమస్యతో మొరాయించిన ఐఆర్సీటీసీ.. మధ్యాహ్నం సేవలు పున: ప్రారంభం
-
Marlon Samuels | వెస్టిండీస్ మాజీ క్రికెటర్‌కు భారీ షాక్.. 6 ఏండ్ల నిషేధం విధించిన కోర్టు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

