Marlon Samuels | వెస్టిండీస్ మాజీ క్రికెటర్‌కు భారీ షాక్.. 6 ఏండ్ల నిషేధం విధించిన కోర్టు
Marlon Samuels : వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మర్లోన్ శామ్యూల్స్(Marlon Samuels)కు భారీ షాక్ తగిలింది. అవినీతి కేసు (Corruption)లో దోషిగా తేలిన అతడు 6 ఏండ్ల నిషేధానికి గురయ్యాడు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(Emirates Cricket Board) నియమాలను ఉల్లంఘించిన కేసులో స్వతంత్ర అవినీతి నిరోధక న్యాయస్థానం గురువారం శామ్యూల్స్‌కు....
Marlon Samuels : వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మర్లోన్ శామ్యూల్స్(Marlon Samuels)కు భారీ షాక్ తగిలింది. అవినీతి కేసు (Corruption)లో దోషిగా తేలిన అతడు 6 ఏండ్ల నిషేధానికి గురయ్యాడు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(Emirates Cricket Board) నియమాలను ఉల్లంఘించిన కేసులో స్వతంత్ర అవినీతి నిరోధక న్యాయస్థానం గురువారం శామ్యూల్స్‌కు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. దాంతో ఈ ఆరేండ్ల పాటు లీగ్ టోర్నీలతో పాటు అన్నిరకాల క్రికెట్‌కు ఈ విండీస్ లెజెండరీ ఆటగాడు దూరం కానున్నాడు.
శామ్యూల్స్‌పై 2021 సెప్టెంబర్‌లో ఈ స్టార్ క్రికెటర్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. రెండేళ్ల క్రితం ఈ ఆల్‌రౌండర్ తనకు వస్తు, ధన రూపంలో ముట్టిన కానుకల గురించి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చెప్పలేదు. తాను బస చేసిన హోటల్ బిల్లు 750 అమెరికా డాలర్లు అంటే రూ. 62,362కు సంబంధించిన పేపర్‌ను దాచిపెట్టాడు. అంతేకాదు కేసు విచారణలో అధికారులకు సహకరించలేదు.
టీ20 ట్రోఫీతో శామ్యూల్స్

దాంతో ఎట్టకేలకు అతడిపై ఐసీసీ కేసు నమోదు చేసింది. అనతరం విచారణలో తాను యాంటీ కరప్షన్ కోడ్(Anti-Corruption Code) ప్రకారం నాలుగు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు శామ్యూల్స్ అంగీకరించాడు. గతంలోనూ శామ్యూల్స్ ఇదే తరహా ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. 2007లో మ్యాచ్ సమాచారాన్ని ఆన్లైన్ స్పోర్ట్స్‌బుక్ వాళ్లకు చెప్పాడు.
విండీస్ గొప్ప క్రికెటర్లలో ఒకడైన శామ్యూల్స్ 18 ఏళ్ల పాటు జాతీయ జట్టుకు ఆడాడు. శామ్యూల్స్ రెండు సార్లు టీ20 ప్రపంచ కప్(T20 World Cup) గెలిచిన జట్టులో సభ్యుడు. 2012, 2016లో కరీబియన్ జట్టు పొట్టి ప్రపంచ కప్ గెలవడంలో శామ్యూల్స్ కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లో 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20ల్లో కలిపి 11,134 పరుగులు చేశాడు. బంతితోనూ రాణించి 152 వికెట్లు తీశాడు.
ఇవి కూడా చదవండి
Sreesanth: టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై చీటింగ్ కేసు..
Indian Cricketers: సింహాచలం ఆలయంలో టీమిండియా క్రికెటర్లు.. వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

