WPL | ముంబై : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్లో భాగంగా తాము ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌ను గుజరాత్ జెయింట్స్ ఓటమితో ముగించింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. 9 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. హర్మన్‌ప్రీత్ (54), సీవర్ (38) ఆదుకోవడంతో 179/6 స్కోరు చేసింది. ఛేదనలో గుజరాత్ 170/9 వద్దే ఆగిపోయింది. ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా భార్టీ ఫల్మలి (61) జెయింట్స్ శిభిరంలో ఆశలు రేపింది. కానీ ఆఖర్లో ఆ జట్టు తడబాటుకు లోనై ఓటమిని కొనితెచ్చుకుంది.