FIFA Worldcup: హైతీ ఆశలు ఆవిరి.. 3-0 గోల్స్ తేడాతో బ్రెజిల్ విక్టరీ
FIFA Worldcup: ఫిఫా వరల్డ్‌కప్‌లో జరిగిన గ్రూప్ సీ మ్యాచ్‌లో.. 3-0 గోల్స్ తేడాతో హైతీపై బ్రెజిల్ విక్టరీ కొట్టింది. మాథ్యూస్ కున్హా ఆ జట్టు తరపున రెండు గోల్స్ చేశాడు. ఇక టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా హైతీ నిలిచింది.
న్యూయార్క్: ఫిఫా వరల్డ్‌కప్(FIFA Worldcup)లో జరిగిన గ్రూప్ సీ మ్యాచ్‌లో.. బ్రెజిల్ జట్టు విజయం సాధించింది. 3-0 గోల్స్ తేడాతో హైతీపై విక్టరీ కొట్టింది. బ్రెజిల్ ప్లేయర్ మాథ్యూస్ కున్హా రెండు గోల్స్ చేశాడు. మొరాకోతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో బ్రెజిల్‌పై విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్ డ్రా కావడంతో ప్లేయర్లు సరిగా పర్ఫార్మ్ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైతీతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ ఆటగాళ్లు దూకుడు పెంచారు. ఆ జట్టులో వినిసియస్ జూనియర్ మరో గోల్ చేశాడు. స్ట్రయికర్ ఇగోర్ థియాగో స్థానంలో ఆడిన కున్హా.. 23వ నిమిషంలోనే తొలి గోల్ చేశాడు. హైతీ డిఫెండర్ హన్నెస్ డిల్‌క్రాక్స్‌కు బంతి తగిలి నెట్లోకి దూసుకెళ్లింది. వినిసియస్ జూనియర్ ఇచ్చిన ఓ పాస్‌ను .. టాప్ కార్నర్ షాట్‌తో కున్హా గోల్‌గా మలిచాడు. ఫస్ట్ హాఫ్ స్టాప్ చేసే సమయంలో వినిసియస్ జూనియర్ ఓ గోల్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ ప్లేయర్ రాఫినా గాయపడ్డాడు. అతని స్థానంలో రయాన్‌ను ఆడించారు. బ్రెజిల్ కీపర్ అలిసన్ అద్భుతంగా చేశాడు. రెండో ఓటమితో ఈ టోర్నీ నుంచి హైతీ నిష్క్రమించినట్లు అయ్యింది. గ్రూపు సీలో ఆ జట్టు ఇంకా ఖాతా తెరవలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

