ఫ్లోరిడా: పాకిస్థాన్ భయపడ్డదే నిజమైంది! వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడి ఆదిలోనే సూపర్-8 రేసులో వెనుకబడ్డ బాబర్ సేనకు వరుణుడు అనూహ్యమైన షాకిచ్చాడు. లాడర్‌హిల్ వేదికగా శుక్రవారం జరగాల్సిన యూఎస్ఏ-ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రైద్దెంది. దీంతో భారత్ (6) తర్వాత అత్యధిక పాయింట్ల (5)తో అమెరికా సూపర్-8 దశకు అర్హత సాధించింది. పాక్ ఖాతాలో 2 పాయింట్లే ఉన్నాయి. అమెరికా ముందంజ వేయడంతో ఈనెల 16న ఐర్లాండ్‌తో పాకిస్థాన్ ఆడబోయే మ్యాచ్ నామమాత్రమే. ఇదిలా ఉండగా పొట్టి ప్రపంచకప్ పోరులో సహ ఆతిథ్య దేశంగా ఉండి తొలిసారి ఈ మెగా టోర్నీ ఆడుతున్న అమెరికా.. మొదటి ప్రయత్నంలోనే సూపర్-8కు చేరడం విశేషం. దీంతో ఆ జట్టు 2026లో భారత్/శ్రీలంక వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌నకూ అర్హత సాధించినైట్టెంది