మలక్‌పేట, డిసెంబర్ 24: వచ్చే నెల 4 నుంచి గుజ్జుల సుధాకర్‌రెడ్డి స్మారక మాస్టర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ప్రకటించింది. ఆదివారం దిల్‌సుఖ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం కార్యదర్శి శ్రీనివాస్ రావు టోర్నీ వివరాలు వెల్లడించారు.
మాస్టర్స్ కోసం పురుషులు, మహిళల విభాగాల్లో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 35, 40, 45, 50, 55, 60, 65, 70 ఏండ్ల వయసు వారు పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు.