IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మరోసారి రెండొందల స్కోర్ నమోదుఅయ్యేలా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లను స్ఫూర్తిగా తీసుకున్నారేమో తెలియదు కానీ లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు విశాఖపట్టణంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఓపెనర్ మిచెల్ మార్ష్(64) మెరుపు అర్థ శతకం సాధించగా.. నికోలస్ పూరన్(35) సిక్సర్లతో విజృంభిస్తున్నాడు.
పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసిన లక్నో మరో మూడు ఓవర్లకే సెంచరీ మార్క్ అందుకుంది. రెండో వికెట్‌కు ఇప్పటికే ఈ జోడీ 50 రన్స్ బాదేసింది. వీళ్లిద్దరూ ఇంకో ఐదారు ఓవర్లు ఆడితే.. లక్నో రెండొందలు కొట్టడం ఖాయం అనిపిస్తోంది. 10 ఓవర్లకు లక్నో స్కోర్.. 117/1.
𝙈𝙖𝙧𝙫𝙚𝙡𝙤𝙪𝙨 𝙈𝙖𝙧𝙨𝙝 💪
He gets to a breezy half-century and is in no mood to stop tonight 🎐
Updates ▶ https://t.co/aHUCFOD61d#TATAIPL | #DCvLSG | @LucknowIPL pic.twitter.com/DbnNwChvi0
— IndianPremierLeague (@IPL) March 24, 2025
టాస్ ఓడిన లక్నోకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఎడెన్ మర్క్రమ్(15) శుభారంభం ఇచ్చారు. స్టార్క్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతిని స్టాండ్స్‌లోకి పంపిన మార్ష్.. ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఓవర్లో ఒకే బౌండరీ వచ్చింది. స్టార్క్ వేసిన రెండో ఓవర్లో రెచ్చిపోయిన మార్ష్ వరుసగా 4, 6, 4 బాదడంతో స్కోర్ 33కి చేరింది. అయితే.. ఈ జోడీని బ్రేక్ చేసేందుకు అక్షర్ యువ స్పిన్నర్ విప్రజ్కు బంతి ఇచ్చాడు. లాంగాఫ్‌లో మర్క్రమ్ గాల్లోకి లేపిన బంతిని అక్కడే కాచుకొని ఉన్న స్టార్క్ ఒడిసి పట్టుకున్నాడు. దాంతో, 46 వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. ఈమ్యాచ్‌లో స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగిన మర్క్రమ్ ఐపీఎల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.