IPL 2025 : చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) బ్యాటర్లు దంచేస్తున్నారు. విధ్వంసక షాట్లతో అలరిస్తున్న రిషభ్ పంత్ (70 నాటౌట్) అర్ధ శతకం సాధించగా.. ఓపెనర్ మిచెల్ మార్ష్(54 నాటౌట్) సైతం ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. సుయాశ్ వేసిన 14వ ఓవర్లో భారీ సిక్సర్‌తో మిచెల్ ఈ సీజన్లో ఏడో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ ఓవర్ నాలుగు, ఐదు రెండు బంతుల్ని పంత్.. 4, 6 గా మలవడంతో లక్నో స్కోర్ 150కి చేరువైంది. 14 ఓవర్లకు స్కోర్.. 149-1.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్(14)ను నువాన్ తుషార యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. షాట్ ఆడాలనుకున్న బ్రీట్జ్.. బంతిని మిస్ అవ్వగా అది మెరుపు వేగంతో ఆఫ్ స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టింది. 25వద్ద లక్నో మొదటి వికెట్ పడింది.
𝙈𝙖𝙠𝙞𝙣𝙜 𝙖 𝙨𝙩𝙖𝙩𝙚𝙢𝙚𝙣𝙩 💪
Rishabh Pant is in the mood tonight 😎
Updates ▶ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB | @RishabhPant17 pic.twitter.com/BM8NmKHcGt
— IndianPremierLeague (@IPL) May 27, 2025
అయినా ఏమాత్రం కంగారు పడకుండా మిచెల్ మార్ష్ (54 నాటౌట్), రిషభ్ పంత్(70 నాటౌట్)లు.. ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. దయాల్ వేసిన 4వ ఓవర్లో 6, రెండు ఫోర్లతో 18 రన్స్ సాధించిన పంత్.. పవర్ ప్లే తర్వాత మరింత చెలరేగాడు. భువనేశ్వర్‌ను ఉతికేస్తూ.. వరుసగా 6, 4 బాదిన లక్నో సారథి.. అనంతరం సుయాశ్ శర్మకు వరుస ఫోర్లతో చుక్కలు చూపించి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో, లక్నో 10 ఓవర్లకు 101 రన్స్ చేసింది.