IPL 2025 : విశాఖపట్టణంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్‌ను టార్గెట్ చేస్తూ మిచెల్ మార్ష్(43 నాటౌట్), ఎడెన్ మర్క్రమ్(15)లు బౌండరీల మోత మోగించారు. ఆపై ముకేశ్ కుమార్ బౌలింగ్‌లోనూ దంచేశారు. దాంతో, లక్నో స్కోర్ 3 ఓవర్లకు 30 దాటింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విప్రజ్ నిగమ్ విడదీశాడు. పవర్ ప్లేలో లక్నో స్కోర్.. 64-1.
టాస్ ఓడిన లక్నోకు ఓపెనర్లు మిచెల్ మార్ష్(), ఎడెన్ మర్క్రమ్(15) శుభారంభం ఇచ్చారు. స్టార్క్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతిని స్టాండ్స్‌లోకి పంపిన మార్ష్.. ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఓవర్లో ఒకే బౌండరీ వచ్చింది. స్టార్క్ వేసిన రెండో ఓవర్లో రెచ్చిపోయిన మార్ష్ వరుసగా 4, 6, 4 బాదడంతో స్కోర్ 33కి చేరింది.
Milestone Unlocked 🔓
1⃣0⃣0⃣0⃣ runs and counting for Aiden Markram in #TATAIPL 👏
How many runs will he score on his #LSG debut? 🤔
Updates ▶ https://t.co/aHUCFODDQL#DCvLSG pic.twitter.com/czvjZDhHjF
— IndianPremierLeague (@IPL) March 24, 2025
అయితే.. ఈ జోడీని బ్రేక్ చేసేందుకు అక్షర్ యువ స్పిన్నర్ విప్రజ్కు బంతి ఇచ్చాడు. లాంగాఫ్‌లో మర్క్రమ్ గాల్లోకి లేపిన బంతిని అక్కడే కాచుకొని ఉన్న స్టార్క్ ఒడిసి పట్టుకున్నాడు. దాంతో, 46 వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. ఈమ్యాచ్‌లో స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగిన మర్క్రమ్ ఐపీఎల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.